పార్టీలో క్రమశిక్షణ లోపం ఉంది… నాయకులకు మానిక్కం ఠాగూర్ హెచ్చరిక

-

హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ లో రచ్చకు దారి తీశాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా కాంగ్రెస్ ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్లు ఓటమిపై నిలదీశారు. జగ్గారెడ్డి, వి. హన్మంతరావు, జానారెడ్డి వంటి వారు పార్టీ పనితీరుపై తీవ్ర అసంత్రుప్తి వెల్లగక్కారని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే మానిక్కం ఠాగూర్ పార్టీ నేలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్నారు. పార్టీ అంశాాలు మాట్లాడాలనుకుంటే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే మాట్లాడాలని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చిరించారు. ఎంత పెద్ద నాయకుడు అయినా పీఏసీలోనే మాట్లాడాలని చెప్పారు. లేదంటే సోనియా, రాహుల్ గాంధీతో మాట్లాడవచ్చని సూచించారు. గీత దాటితే వేటు తప్పదని హెచ్చిరించారు. హుజూరాబాద్ లో ఓటమిపై నివేదిక ఇవ్వాలని టీపీసీసీ ని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version