ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

-

తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో నిర్యహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమవుతోంది.  ఈ పండుగ ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటనున్నారు. ఇందుకు గాను దేశ, విదేశాల్లో పండుగను వైభవంగా జరిపేందుకు రూ.20 కోట్ల నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…  25 దేశాల నుంచి వచ్చే 75 మంది బ్రహ్మకుమారీలు రాష్ట్రంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. బతుకమ్మను ఎలా తయారుచేయాలి, ఏమేం పూలు వాడాలి అన్న వివరాలతో ఉన్నటువంటి దృష్య‌, శ్ర‌వ‌ణ రూపంలో సీడీలు, డీవీడీలు, బుక్‌లెట్లను తెలంగాణ పర్యాటక శాఖ తయారు చేయిస్తోందన్నారు.

బ్రహ్మకుమారీల గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌, బతుకమ్మ ఉత్సవాల సీడీలు, గోడపత్రికను శనివారం ఆయన ఆవిష్కరించారు. పూల పండుగ వైభవాన్ని   సామాజిక మాధ్యమం వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version