భారీగా వెయిట్ తగ్గిన కేరళ కుట్టి..ఇక సినిమాలు క్యూ కడతాయా…!

-

ఈ సన్నజాజి ఎక్కడో నుంచి సడన్‌గా ఊడిపడలేదు. పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమ పరమేశ్వరనే ఇలా సన్నగా మారిపోయింది. లాక్‌డౌన్‌ టైంలో ఏం చేశావని అడిగితే.. ఇలా 8 కేజీలు తగ్గానని గర్వంగా చెప్పుకుంటోంది అనుపమ. అనుపమ పరమేశ్వరన్‌ రాక్షసుడు తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. ప్రస్తుతం నటిస్తున్న తమిళ్ మూవీ తప్ప మరోటి చేతిలో లేదు. అఆతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ ముందు నుంచీ బొద్దుతనం మెయిన్‌టేన్‌ చేస్తూ వచ్చింది. వెయిట్ మరింత పెరగడంతో.. చిన్న హీరోలు కూడా ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. హీరోయిన్‌ అంటే స్లిమ్‌గా వుండాలన్న సూత్రాన్ని ప్రయోగించి లాక్డౌన్‌ టైంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన స్టిల్స్ చూస్తుంటే.. అనుపమకు ఓ చెల్లి వుందా? ఆమె పొటోలు పోస్ట్‌ చేసిందేమోనన్న అనుమానం వచ్చినా.. ఆ తర్వాత తేరుకుని.. అనుపమే ఇలా మేకోవర్‌ అయిందని తెలిసి షాక్‌ అవ్వడం నెటిజన్ల వంతవుతోంది. కష్టపడి 8 కేజీలు తగ్గి కొత్త ఫేస్‌తో కొత్త హీరోయిన్‌గా కనిపిస్తున్న ఈ కేరళ కుట్టికి ఛాన్సులు వరిస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version