మహిళల భద్రత కోసం ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా వారి మీద దాడులు ఆగడం లేదు. హైదరాబాద్ లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ లోని పాతబస్తీ రెయిన్ బజార్ లో ఈ దారుణం జరిగింది. పాతబస్తిలో యువతిని రేప్ చేసి దారుణంగా హత్య చేశారు. కత్తితో పొడిచి చంపారు దుండగులు.
బాధితురాలు నారాయణ ఖేడ్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఉస్మానియాలో పోస్టు మార్టం పూర్తయింది. నారాయణ ఖేడ్ కు మృత దేహం తరలించారు. యువతి ప్రేమ వ్యవహారంలో దారుణంగా రేప్ చేసి ప్రియుడి సోదరుడు హత్య చేసినట్టు గుర్తించారు. అయితే దీనికి మతాంతర ప్రేమ వ్యవహారమే కారణమని అంటున్నారు. అత్యంత దారుణంగా యువతిని దుండగులు నరికి చంపారు. ఇక ఈ కేసులో దుండగులని పోలీసులు అరెస్ట్ చేశారు.