ముంబయి సముద్రంలో చెత్త……రూ.10 వేల జరిమానా వేసిన బీఎంసీ

-

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఏ అంశమైనా సరే స్పందిస్తారు. తాను పోస్టులు చేస్తారు.. లేదంటే యూజర్ల పోస్టులను రీ ట్వీట్, లేదా కామెంట్ చేస్తుంటారు. ఒకతను షేర్ చేసిన వీడియోపై ఆనంద్ మహీంద్రా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ముంబైలో పరిశుభ్రత పాటించే అంశంపై నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు.
గేట్ వే ఆఫ్ ఇండియా ముందు ఓ వ్యాన్‌లో నలుగురు వచ్చారు. గన్నీ బ్యాగ్‌లో చెత్త, కాగితాలను తీసుకొచ్చారు. రెండు బ్యాగులు తీసుకు రాగా.. ఒకతను వీడియో తీశారు. మెల్లిగా అటు, ఇటు చూసి ఆ చెత్తను అరేబియా సముద్రంలో పడవేశారు. ఒకటి తర్వాత మరొకటి వేసేశారు. ఆ వ్యక్తుల తీరుపై వీడియో తీసే అతను కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఒకతను షేర్ చేయగా.. ఆనంద్ మహీంద్రా చూశారు. ఆ క్లిప్ చూసి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యకరమైన వీడియోలు, ప్రతిభావంతుల వీడియోలను మాత్రమే కాదు, ఇలాంటి వీడియోలను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న ఆనంద్ ఈ వీడియోను తేలిగ్గా తీసుకోలేకపోయారు. వెంటనే ముంబయి నగర పాలక సంస్థ బీఎంసీని ట్యాగ్ చేస్తూ వీడియోను రీట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాలు బాగుండడం కాదు… ముందు మన అలవాట్లు మార్చుకోవాలి… అప్పుడు సానుకూల మార్పు వస్తుంది అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version