ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏప్రిల్ – మేలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కోలేక తెరాస అధినేత కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని భాజపా జాతీయ అమిత్ షా విమర్శించారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ… ముందస్తు ఎన్నికల నిర్ణయం వల్ల ప్రజలపై అధిక భారం పాడనుందన్నారు. తెలంగాణలో యువతకు ఆశించిన మేరకు ఉద్యోగాలు రాలేదు.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న వాగ్దానం అమలులో విఫలమయ్యారు,.. 2014లో తెరాస ప్రభుత్వం ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. 2018లోనూ ఎస్సీని సీఎంగా చేయలేరని తీవ్రంగా దుయ్యబట్టారు
. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేస్తూ చవకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్మూ కేసీఆర్ కి ఉందా? తెలంగాణలో ఒక్క భాజపా కి తప్పా మరే పార్టీకి అంత సీన్ లేదన్నారు. కోట్లాది ప్రజల ఆర్యోగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.5లక్షల బీమా పథకాన్ని కేసీఆర్ తెలంగాణకు వద్దన్నారు. ఈ సభకి వివిధ ప్రాంతాల నుంచి నేతలు, భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.