ట్విట్టర్ వేదికగా జగన్, పవన్ లపై సీఎం ఫైర్
పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసుకున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాజధానికి కేంద్ర నుంచి 75 వేల కోట్లు రావాలని తేల్చింది… ఇప్పుడు కమిటీ గురించి, నరేంద్ర మోదీ గురించి జనసేన అధినేత పవన్ ఎలాంటి విమర్శలు చేయరు. మోదీ ఎలా చెబితే పవన్ అలా నడుచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు తమ కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారి మాటలకు స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని సైతం తూర్పారబట్టారు.
గత ఎన్నికల్లో మాకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోదీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారు, కానీ ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదు. pic.twitter.com/De4vpF1fqG
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2018
ప్రతిపక్ష పార్టీ నేతలకు కేసుల నుంచి బయటపడటంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రాన్ని విమర్శించడం మానేసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. pic.twitter.com/cDo3mMuv6S
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2018