వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్….

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ అండ్ గ్లింప్స్ కి ఆడియన్స్ మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేశారు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ‘వాఘా బోర్డర్’లో ‘వందేమాతరం’ అంటూ దేశభక్తిని చాటుతూ సాగే ఈ పాటని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇతర దేశంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంతో రూపొందుతుందుతున్నా ఈ చిత్రం తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version