కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతులందరూ నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకి మద్దతుగా ఇతర దేశాల సెలెబ్రిటీలు తమ మద్దతుని తెలుపుతున్నారు. అలా మద్దతు తెలిపిన వారిలో బ్రిటీష్ నటి జమీలా జమీల్ కూడా ఒకరు. చాలా రోజుల క్రితం వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న నిరసనకి సోషల్ మీడియా వేదికగా తన మద్దతు ప్రకటించింది. అప్పటి నుండి జమీలాపై అనేక విమర్శలు వస్తున్నాయి.
తాజాగా జమీలా జమీల్ కి రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. చంపేస్తాం, రేప్ చేస్తాం అని బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయని, అయినా సరే రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఉంటానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జమీలానే కాదు పాప్ సింగర్ రిహన్నా, ట్విట్టర్ సీఈవో డోర్సీ మొదలగు వారందరూ రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలని మద్దతు తెలిపారు.