రెండు దశాబ్దాల క్రితం పాకిస్తాన్ కు స్పేస్ టెక్నాలజీని అమ్ముతున్నారనే ఆరోపణలపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయనణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి కేసుపై పోరాటం చేస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించగా సుప్రీం నంబీ నారాయనణ్ ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పుని వెలువరించింది. తప్పుడు ఆరోపణలతో తనకు వ్యక్తిగత హోదాకు బంగం కలిగించినందుకు సుప్రీం ఆదేశాల మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ శాస్త్ర వేత్తకు రూ.50 లక్షల నష్టపరిహారం అందించారు. కొద్ది రోజుల క్రితం దీపక్ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసం తీర్పునిచ్చింది. నారాయనణ్ అరెస్టుని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వం
-