హుజూరాబాద్ ఉపఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. కారు కమలం మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాక ముందే బీజేపీ, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా హరీష్రావు ఈటెలకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అలాగే రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉపఎన్నిక తేదీలు రాక ముందే నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ పల్లెను నాయకులు సందర్శిస్తున్నారు. ఉపఎన్నిక ఫలితంగా రాష్ట్ర ప్రజలపై అధికార పార్టీ పథకాలను కురిపిస్తోంది. గతంలో దళితబంధు పథకాన్ని తీసుకువచ్చింది. విడతల వారీగా అన్ని కులాల వారికి బంధును వర్తింప చేస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్ఛారు. ఈనేపథ్యంలో టీ ఆర్ ఎస్ గెలుపు బాధ్యతలను హరీష్ రావు బుజాలపై వేసుకున్నారు. తాజాగా రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు హామీని తెరపైకి తీసుకువచ్చారు. ఈటెల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆవర్గం
ఈటెలకు ఓటమి భయం పట్టుకుంది. త్వరలో రెడ్డి కార్పోరేషన్- హరీష్ రావు
-