ఐపీఎస్ ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా….

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన చిత్రం’12th ఫెయిల్’. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషి ఆటోగ్రాఫ్ ను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు వీరే. వారిని కలిసినందుకు నేను గర్వపడుతున్నా’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాను ఆనంద్ వీక్షించి వారిని కలిశారు.

ఇక భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version