ఫ్యామిలీ స్టార్’ నుంచి మరో సాంగ్ రిలీజ్

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదలైంది. ‘నందనందనా‘ అంటూ సాగే పాటను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు.  గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version