కొనసాగుతున్న పీసీసీ సమావేశం… సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు….

-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాసమున్షీ, మంత్రులు,డీసీసీ అధ్యక్షులు,పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నామినేటేడ్ పోస్టుల భర్తీ చేపడతామని, త్వరలో 6 గ్యారంటీల అమలుకు గ్రామ కమిటీలను నియమించనున్నారు. అలాగే జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి, దానికి బదులుగా త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నారు.

 

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తలతాకట్టు పెట్టెనా 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version