గత 12 ఏళ్లలో భారత్ ఓడడం ఇదే తొలిసారి

-

భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది.5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇండియా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

స్వదేశంలో వరుసగా మూడు టెస్టుల్లో భారత్ విజయం సాధించకపోవడం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. గత 3 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకటి ఓడిపోగా, అదే జట్టుతో ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తాజాగా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్లో IND టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఉప్పల్‌ స్టేడియంలో భారత్ ఆడిన టెస్టు మ్యాచ్‌లు – రిజల్ట్స్

– తొలి టెస్టు : న్యూజిలాండ్‌- (2010 నవంబర్‌ 12-16) .. మ్యాచ్‌ డ్రా

– రెండో టెస్టు : న్యూజిలాండ్‌-(2012 ఆగస్టు 23-26).. ఇండియా విజయం

– మూడో టెస్టు : ఆస్ట్రేలియా-(2013 మార్చి 2-5).. భారత్‌ విజయం

– నాలుగో టెస్టు : బంగ్లాదేశ్‌-(2017 ఫిబ్రవరి 9-13).. ఇండియా విజయం

– ఐదో టెస్టు : వెస్టిండీస్‌-(2018 అక్టోబర్‌ 12-14).. ఇండియా విజయం

– ఆరో టెస్టు : ఇంగ్లండ్‌- (2024 జనవరి 25-28).. ఇంగ్లండ్‌ విజయం

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version