చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు ఎంత పనిచేసింది?

-

 


తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెదేపా..నేడు అదే పార్టీతో కలిసి పనిచేయడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక కాంగ్రెస్ లోని కొంత మంది ఒకడుగు ముందుకేసి రాజీనామాలు సైతం చేశారు.రోజుల క్రితం వట్టి వసంత కుమార్ రెండు రోజుల క్రితం రాజీనామా చేయగా, నేడు సి. రామచంద్రయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త‌న రాజ‌కీయాల కోసం చంద్రబాబు ఎన్ని నాట‌కాలు అయిన ఆడతారని విమ‌ర్శించారు.

విభజన సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఏ స్థాయిలో విమర్శలు చేసాడో ప్రజలకు తెలుస‌న్నా‌రు. అధికారం కోసం ఏ పార్టీ తోనైన కలవడం, విడిపోవడం బాబుకి అలవాటే అని ఎద్దేవా చేశారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ ని ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మధ్య కాలంలోనే ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ని వీడి జనసేన పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అసలు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీలోని నాయకులు, నేతలంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగా…ఏపీలో అసలు ప్రస్తుతం మనుడలేని కాంగ్రెస్ పార్టీనాయకులకు వచ్చిన నష్టం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version