టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొడుకు ఫస్ట్ లుక్ ఇదే..!

-

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పండంటికి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకుకు ఇజాన్ అని పేరు పెట్టారు. ఇజాన్ ను ఎత్తుకొని హాస్పిటల్ లో సానియా నడుస్తూ వెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సానియా మీర్జా ఫ్యాన్స్ క్లబ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫోటోను షేర్ చేశారు.

2010 లో సానియాకు, పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ కు పెళ్లి జరిగింది. సానియాకు కొడుకు పుట్టిన విషయాన్ని కూడా షోయెబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి చెప్పాడు. తన కొడుకు పేరు ఇజాన్ మీర్జా మాలిక్ అని తెలిపారు. ఇజాన్ అంటే అరబిక్ లాంగ్వేజ్ లో దేవుడి కొడుకు అని అర్థం.

Read more RELATED
Recommended to you

Exit mobile version