ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో రాష్ట్రంలో సంచలనం నెలకొంది. బన్నీ ప్రస్తుతం చిక్కడపల్లి పీఎస్లో ఉంచినట్లు సమాచారం రావడంతో ఆయన ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ను స్టేషన్కు తీసుకురాగా ముందే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇటీవల ఈనెల 5న పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మరణించిన విషయం తెలిసిందే. దీంతో మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు బన్నీమీద కేసు ఫైల్ చేశారు. శుక్రవారం ఈ కేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది.అనంతరం కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తుండగా.. ముందస్తు బెయిల్ కోసం బన్నీ టీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.