తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

-

తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్‌. తన అరెస్ట్‌ పై క్వాష్‌ పిటిషన్‌ వేశారు అల్లు అర్జున్‌. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఙప్తి చేశారు.

పోలీసులను అడిగి 2.30కి చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఇక ఈ విచారణ 2.30కి వాయిదా వేశారు. ఇక అటు మరికాసేపట్లో గాంధీ ఆస్పత్రి కి అల్లు అర్జున్ ను తరలించనున్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రి వర్గాలు అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రి లోపల బయట భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకు వస్తున్న నేపద్యంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news