జగ్గారెడ్డిని కష్టడీకి ఇవ్వండి.. కోర్టుని కోరిన పోలీసులు

-

తప్పుడు సమాచారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి  పాస్ పోర్ట్ పొందిన కేసులో నిందితుడుగా ఉన్న జగ్గారెడ్డిని కష్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. మనుషుల అక్రమ రవాణా తదితర కేసుల్లో జగ్గారెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే. పోలీసుల కస్టడీ పిటిషన్ పై విచారణను సికింద్రాబాద్ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో జగ్గారెడ్డి తరుఫు న్యాయవాది పోలీసుల కష్టడీకి జగ్గారెడ్డిని ఇవ్వొదంటూ కౌంటర్ వేయగా ఈ కేసును కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version