‘అంకుల్ బాల్ దోనా..’ అదే.. అదే మాట మనోడి జీవితాన్నే మార్చేసింది. 26 ఏళ్ల పార్థ్ తివారీని 30 కిలోలు తగ్గేలా చేసింది. రోడ్డు మీద పార్థ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పిల్లాడు అంకుల్ బాల్ ఇవ్వండి.. అంటూ అడిగాడట. దీంతో మనోడికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నాడట. అంతకుముందు 124 కిలోల బరువుండేవాడు పార్థ్. కానీ కేవలం 4 నెలల్లోనే పర్ ఫెక్ట్ డైట్ ఫాలో అయి 30 కిలోలు తగ్గడమే కాదు.. బాడీని కూడా ఎంతో ఫిట్ గా మార్చుకున్నాడు పార్థ్. ఇదివరకు ఆల్కాహాల్ బాగా తాగేవాడట పార్థ్. ఇప్పుడు ఆల్కాహాల్ బంద్.. ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్.
రోజుకు రెండు గంటలు మాత్రం సీరియస్ గా వర్కవుట్ చేసేవాడట పార్థ్. అందులో గంటన్నర వెయిట్ తగ్గడానికి, 30 నిమిషాలు కార్డియో, 15 నిమిషాలు హెచ్ఐఐటీ ఎక్సర్ సైజ్ చేసేవాడట. ఇలా 4 నెలల పాటు క్రమం తప్పకుండా డైట్ పాటించి 30 కిలోలు తగ్గడంతో పార్థ్ బంధువులు, స్నేహితులు మనోడిని చూసి షాక్ అవుతున్నారట.