మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 2,521 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా పలు పోస్టులు భర్తీ చేస్తోంది.
ఇక పోస్టుల వివరాలని చూస్తే…కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, బ్లాక్ స్మీత్, వెల్డర్ తదితర విభాగాల్లో ఖాళీలు వున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి టెన్త్ ప్యాస్ అయ్యి ఉండాలి.
అలానే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. ఇక ఖాళీల వివరాలను చూస్తే.. మొత్తం ఖాళీలు 2521 ఉండగా జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు 884, భోపాల్ డివిజన్‌లో ఖాళీలు 614, కోట డివిజన్‌లో ఖాళీలు 685, కోటా వర్క్ షాప్ డివిజన్ లో ఖాళీలు 160, CRWS BPL డివిజన్‌లో ఖాళీలు 158 వున్నాయి.
ఈ పోస్టులకి ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు అర్హులు కారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 17. వయస్సు విషయానికి వస్తే.. 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.100 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వుంది. సెలెక్షన్ ప్రాసెస్ కోసం చూస్తే.. షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.