డబ్బులను సంపాదించాలని కొందరు, పది మంది మెచ్చుకొనెలా ఉద్యోగాలను ఇవ్వాలనో ఏదొక కారణం వల్ల కొత్తగా స్టార్టప్ కంపెనీలు పుట్టు కొస్తున్నాయి.. ప్రపంచంలో అత్యధిక స్టార్టప్ కంపెనీలు కలిగిన మూడో దేశం మన భారత దేశం..రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్పేస్ రాకెట్ నుంచి హోమ్ డెలివరీ సేవల వరకు ఎన్నో రంగాల్లో స్టార్టప్‌లదే హవా. తాజాగా ముంబయికి చెందిన ఓ స్టార్టప్ బిజినెస్ మోడల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ, ఆ కంపెనీ ఎలాంటి సేవలందిస్తోందో తెలుసా..
ఎవరైనా తమకు కావలసిన వారిని కొల్పొతే, వారిని అక్కున చేర్చుకుని ఓదార్పును ఇస్తారు.అంతేకాదు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కార్యక్రమాలను తామే దగ్గరుండి చేస్తామని చెబుతారు..ఇంతకీ ఆ కంపెనీ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీ కర్మకాండలతోపాటు, అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడంవంటి సేవలను అందిస్తామని చెబుతోంది.ఈ స్టార్టప్‌కు సబంధించిన ఫొటోను కొందరు వ్యక్తులు తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి స్టార్టప్ అవసరం ఉందా? అని ట్వీట్ చేశారు.
Height of #Capitalism
A company has been formed which will carry out the final rites. As a membership fees, it will charge around ₹37,500 which will include pandit/ hairdresser/ men giving shoulder, people who will walk together and chant ‘Ram naam satya hai’ in the (1/2) pic.twitter.com/zTd9bsNbJm
— Diksha Yadav (@DikshaY62646349) November 20, 2022