నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. కాలుష్య నియంత్రణపై సరైన చర్యలు తీసుకోనందున రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ ఆదర్స్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. నగరంలోని జనావాస ప్రాంతాల్లోని ఉక్కు శుభ్రపరిచే కేంద్రాలపై చర్యలు తీసుకోకపోవడంతో ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు శుద్ధి చేసే కేంద్రాలను తక్షణమే మూసేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యం కారణంగా క్షేత్రస్థాయిలో ఉన్న వారు అనారోగ్యానికి గురవుతున్నట్లు వివరించింది.