తెలుగు రాష్ట్రాల శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల..

-

తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ ని ఈసీ విడుదల చేసింది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం 2019 మార్చి 29 నాటికి  పూర్తికానుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల చేయనుంది. నవంబరు 6వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.

ఏపీ – తెలంగాణలో నియోజకవర్గాల వారీగా..

ఆంధ్రప్రదేశ్‌లో..

ఉభయ గోదావరి జిల్లాలకు పట్టభద్రుల నియోజకవర్గం

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం,

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం

 తెలంగాణలో..

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం

మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం

Read more RELATED
Recommended to you

Exit mobile version