ఇండోనేషియాలోని సులావెసీ ద్వీపంలో సునామీ బీభత్సం సృష్టించింది. సముద్రంలోపల వచ్చిన భూకంపం వల్ల సముద్రం అల్లకల్లోలం అయింది. దీంతో తీర ప్రాంతాలపై సునామీ విరుచుకుపడింది. సముద్రంలోపల వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదయింది. ఆ తీవ్రతకు సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సునామీ రూపంలో విరుచుకుపడి తీర ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. ఈ సునామీతో చాలా మంది ప్రజలు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. సునామీ ప్రభావంతో సమాచార వ్యవస్థ, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చిన్నాభినం అయింది. సునామీ కంటే ముందు మరో భూకంపం ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. అనంతరం వచ్చిన సునామీ ఆ ప్రాంతాన్నంతా తుడిచిపెట్టేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Major tsunami reported to have hit Palu, Indonesia after M 7.5 earthquake today, Sept 28! pic.twitter.com/01pQw4oNCB
— severe-weather.EU (@severeweatherEU) September 28, 2018