ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ విప్, విప్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం… ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ చీఫ్ విప్‌గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ రామాంజనేయులు నియామకం అయ్యారు. అసెంబ్లీ విప్‌లుగా 15 మంది.. వీరిలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది.
శాసనమండలి చీఫ్ విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియామకం అయ్యారు. విప్‌లుగా టీడీపీ నుంచి వేపాడ చిరంజీవిరావు, కంచెర్ల శ్రీ కాంత్, జనసేన నుంచి పి.హరిప్రసాద్‌లకు అవకాశం దక్కింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ రాజును ఫైనల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి పార్టీలను సంప్రదించిన తర్వాత… ఈ నిర్ణయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీంతో రేపు రఘురామకృష్ణ రాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేయనున్నారు.