త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికలుమొదలుకుని, ఎంపీటీసీ,జడ్పీటీసీ, సహకార సంఘాలు, పార్లమెంటు ఎన్నికల వరకుతెలంగాణలో తెరాస విజయాల పరంపర కొనసాగాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పేర్కొన్నారు. తెరాస గురించి దేశ రాజధానిలో సైతం చర్చజరగాలన్నారు. మంగళవారంతెలంగాణ భవన్‌లో తెరాస ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, తదితరనేతలకు 16 లోక్‌సభస్థానాల్లో భారీ ఆధిక్యంతో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు కొత్త ఓటర్ల నమోదులో తెరాసశ్రేణులు పాల్గొనాలని, ప్రతిఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సంక్రాంతి నాటికి 33 జిల్లాల్లో (కొత్తగా ఆవిర్భవించే రెండుజిల్లాలతో కలిపి) పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభిస్తామని వివరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. స్థానిక సంస్థలు పాలనలో కీలకమైనవి. మన కార్యకర్తలను,నేతలను గెలిపించుకోవాలి. ఇప్పటికే శాసనసభఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పార్లమెంటు ఎన్నికలు మరో నాలుగునెలల్లో రాబోతున్నాయి. ఇందులో 16 స్థానాలు గెలిస్తే కేంద్ర ప్రభుత్వఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తాం. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికిపూర్తిస్థాయిలో నిధులను పొందుతాం అంటూ దిమా వ్యక్తం చేశారు.
గెలుపే లక్ష్యంగాత్వరలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను కేసీఆర్ నియమిస్తారని తెలిపారు. తెలంగాణలోతెరాస పై ప్రజలు చూపించిన ఆదరణకు వారికి మరిన్ని సంక్షేమ పథకాలను అందిస్తామనితెలిపారు.