తెలంగాణలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గుప్త నిధులు ఉన్నాయని భావించిన ఇద్దరు మంత్రగాళ్లు వాటిని దక్కించుకోవడానికి మైనర్ బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
జిల్లాలో బంగారం నిధి ఉన్నట్లు ఇద్దరు మంత్రాగాళ్ళు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాచేస్తే ఆ బంగారం తమకు దక్కుతుందని వారు భావించారు. తీరా ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.