సీబీఐ జాయింట్ డైరెక్టర్, స్పెషల్ జాయింట్ డైరెక్టర్ మధ్య వివాదం కారణంగా కేంద్ర ఈ ఇద్దరిని సెలవుపై పంపడంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం ను ఆశ్రయించారు. దీంతో ఈ కేసుపై నేడు సుప్రీం విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండువారాల్లోగా విచారించి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది.
విచారణను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌ను నియమించింది. ఇందుకు ఇచ్చిన గడువు ముగియడంతో సీవీసీ నేడు సుప్రీంకు విచారణా నివేదికను అందజేయనుంది. బలవంతంగా తనని సెలువుపై పంపడంతో పాటు స్వతంత్ర్య వ్యవస్థగల సీబీఐ పై కేంద్రం పెత్తనం చేలాయించడం వంటి అంశాలను అలోక్ వర్మ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.