2.ఓ పైరసీ చేస్తాం.. దమ్ముంటే ఆపండి

-

శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 550 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. నవంబర్ 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇక భారీ హంగులతో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు పైరసీ వెబ్ సైట్ నుండి హెచ్చరికలు వచ్చాయి.

2.ఓ రిలీజైన గంటలోనే హెచ్.డి క్వాలిటీతో పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో పెడతామని. దమ్ముంటే దాన్ని ఆపండి చూద్దామని హెచ్చరిస్తున్నారు. కొత్తగా రిలీఇన ఏ సినిమా అయినా సరే రిలీజైన రోజే ఆన్ లైన్ లో లీక్ చేసే తమిళ రాకర్స్ ఇప్పుడు 2.ఓ మీద పడ్డారు. ఈమధ్య వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్ సర్కార్ ను పైరసీ చేసిన తమిళ రాకర్స్ 2.ఓ ను పైరసీ చేస్తామని ప్రకటించారు.

ఇలా వారు అంత ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం పట్ల కారణాలు ఏమై ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. అయితే వారికి అడ్డుకట్ట వేసేలా చట్టపరమైన చర్యలకు దిగేందుకు 2.ఓ దర్శక నిర్మాతలు వెనుకంజ వేయట్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version