ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామంటున్న పురందేశ్వరి….

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ఒక బీజేపీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని అలాగే పంచాయతీ నిధుల దగ్గర్నుంచి ఇసుక ,మాఫియా పై కూడా పోరాటం చేస్తున్నామని బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అడ్డపుశిలలో గల టిడ్కో ఇండ్లను పరిశీలిస్తూ టిడ్కో ఇండ్ల ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా రాసి ఉన్న బోర్డుని చూసి సంబంధిత హౌసింగ్ అధికారిని నిలదీసింది. పేదల పట్ల మీ వైఖరి ఇదా అంటూ వైసీపీపై ఆరోపణలు చేసింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే పార్టీ యొక్క వైఖరిని ప్రజలకు వివరించడానికి వచ్చామని తెలిపింది. కేంద్రం సహాయం తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసింది. జగన్ యొక్క పాలన దారుణంగా ఉందని రాష్ట్రంలోని రోడ్లు ఉయ్యాల జంపాల మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేసింది. పార్వతిపురంలోని 16 గ్రామాలను అభివృద్ధి చేయలేదని షెడ్యూల్ తెగలకు వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version