ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేలం ప్రారంభం కాబోతుంది. మొత్తం 77 ఖాళీలు ఉండగా 333 మంది ఆటగాళ్లు వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాగా, ఫ్రాంచైజీలకు రిహార్సల్ గా మాక్ యాక్షన్ నిర్వహించారు. వేలం నియమాలు మరియు తదితర అంశాలు తెలియడానికి ఈ మాక్ యాక్షన్ ని జియో సినిమా నిర్వహిస్తోంది. ఈ మాక్ వేలంలో సురేష్ రైనా(CSK) ,అనిల్ కుంబ్లే మరియు పార్టీ పటేల్ గుజరాత్ టైటాన్స్ కి , మోర్గాన్ (srh)కి, ఆకాష్ చోప్రా, మైక్ ఎసన్ (RCB), రాబిన్ ఉతప్ప, అభినవ్ సింగ్ ,rp సింగ్ లు ఆయా ఫ్రాంచైజీ యజమానుల్లా వ్యవహరించారు.
అయితే ఈ మాక్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 18.5 కోట్లకు దక్కించుకుంది. అలాగే సౌత్ ఆఫ్రికా ఆటగాడు గిరాల్డ్ కోయెడ్జి ని 18 కోట్లకి గుజరాత్ టైటాన్స్, బ్యాట్ కమింగ్ సన్రైజర్స్ 17.5 కోట్లకు శార్దూల్ ఠాకూర్ నీ పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు, హరి బ్రూక్ ని 9.5 కోట్లకు గుజరాత్ టైటాన్స్, హసరంగాను 8.5 కోట్లకు మరియు ట్రావిస్ హెడ్ ని 7.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నారు.