ఎన్నిల కోడ్ అనేది ప్రభుత్వం రద్దు చేసిన మరుక్షణం నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అమలులో ఉంటుందని ఈసీ వివరించింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఓటర్లను ఆకర్షించే విధంగా విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, నూతన పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని నియమావళిలో పేర్కొంది. అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు, సిబ్బందిని వినియోగించరాదని స్పష్టం చేసింది. ఎస్‌ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పిన నియమనిబంధనలన్నీ వర్తిస్తాయని వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ఆధారంగా చేసుకుని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మైన నియమావళిని విడుదల చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవన్నీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు వర్తిస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఈమేరకు … కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ ఈసీ లేక రాసింది.