బిగ్ బాష్ లీగ్ లోకి “డేంజరస్ ప్లేయర్” నికోలస్ పూరన్

-

వెస్ట్ ఇండీస్ కీపర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ జాతీయ కెప్టెన్ గా దిగిపోయినప్పటి నుండి మంచి ప్రదర్శనను కనబరచడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. గత రెండు నెలలుగా నాన్ స్టాప్ గా క్రికెట్ ఆడుతున్న పూరన్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. వీలైనంతగా తనదైన శైలిలో ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ న్యూ యార్క్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి విలువైన పరుగులు చేసి టైటిల్ ను అందించాడు. ఈ ఫైనల్ లో పూరన్ కేవలం 55 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం ఇండియా తో జరుగుతున్న టీ 20 సిరీస్ లోనూ నిలకడగా రాణిస్తూ ప్రపంచ వ్యాప్తంగా లీగ్ టీం లకు తనను కన్సిడర్ చేయాలని సిగ్నల్ ఇచ్చాడు.

గా తెలుస్తున్న సమాచారం ప్రకారం రానున్న బిగ్ బాస్ లీగ్ లో ఆడనున్నాడు. సెప్టెంబర్ లో జరగనున్న మినీ వేలంలో ఇతని పేరును డ్రాఫ్ట్ లో చేర్చారు. ఇక గతంలో మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడి ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version