3 గంటల కాంగ్రెస్‌ కావాలా…? 3 పంటల కేసీఆర్‌ కావాలా? – హరీష్‌ రావు

-

3 గంటల కాంగ్రెస్‌ కావాలా…? 3 పంటల కేసీఆర్‌ కావాలా? అంటూ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నారు …మూడు పంటలకు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా అని ప్రజలను అడిగారు. ఒకప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ లో గెలవక ముందు గజ్వేల్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని.. రోడ్లు కూడా ఉండేవి కాదు.

గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చాడని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ చేశారు హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ రంగంపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రత్యక్షంగా, ఈ రంగంపై ఆధారపడిన పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం వారికి ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలనిస్తూ, చెరువుల్లో పెంచుతున్నదని వివరించారు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నదని.. గౌడ సోదరులకు తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసిందన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version