టిట్లీ తుపాను దాటీకి పూర్తిగా నష్టం పోయిన ఉత్తరాంధ్రకు న్యాయం జరిగేలా తాను పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… పలాస ప్రాంతంలో కే జి బోర్డ్ ఏర్పాటు చేయాలని, వలసలు పెరిగిపోకుండా చర్యలు తీసుకోవాలని తెదేపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి చేతకాకపోతే జనసేన ప్రభుత్వం వస్తే వలసలు వెళ్ళి ప్రతి వ్యక్తిని తిరిగి సొంత జిల్లా తీసుకొస్తామన్నారు. తుపాను వల్ల తీవ్ర నష్టం జరిగింది… ప్రభుత్వం అందిచే.. 25 కేజీల బియ్యం కాదని, 20 సంవత్సరాలు భవిష్యత్తు కావాలని తెలిపారు. ఇక్కడున్నవారెవ్వరూ భూములు అమ్మ వద్దని సూచించారు.. ఉద్దానం ప్రాంతాన్ని ఓదార్చేవారు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.