అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ లవ్ లో సక్సెస్ అవ్వలేరు. చాలా మంది ప్రేమలో పడిన తర్వాత కూడా ఏదో ఓ కారణం వలన విడిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా మధ్యలోనే విడిపోవలసి వస్తుంది. మీకు కూడా బ్రేకప్ అయ్యిందా బ్రేకప్ నుండి బయట పడాలనుకుంటున్నారా..? అయితే బ్రేకప్ నుండి బయట పడేసే ఐడియాస్ ఇవే మరి వాటి కోసం ఇప్పుడే చూసేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వలన బ్రేకప్ అవ్వచ్చు కారణం ఏదైనా సరే మీ ప్రియుడిని కానీ ప్రేయసిని కానీ మర్చిపోవాలంటే ఇవి మీకు హెల్ప్ అవుతాయి.
నచ్చిన వాటి మీద ధ్యాస పెట్టండి:
మీరు మీకు నచ్చిన వాటి మీద ధ్యాస పెడితే కచ్చితంగా బ్రేకప్ నుండి బయటపడొచ్చు లేకపోతే పదే పదే బాధ పడాల్సి ఉంటుంది.
ఇప్పుడు గురించి ఆలోచించండి:
గతం గురించి పదే పదే తలుచుకుని బాధపడొద్దు ప్రస్తుతం గురించి ఆలోచించి ఇప్పుడు జరగాల్సిన పనులు చూసుకోండి. ఇలా కూడా మీరు బ్రేకప్ నుండి బయట పడొచ్చు.
బహుమతుల గురించి మర్చిపోండి:
చాలామంది బాయ్ ఫ్రెండ్ లేడా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ ని చూసుకుంటూ పదేపదే బాధపడుతూ ఉంటారు అటువంటి వాటిని దూరంగా ఉంచండి అప్పుడు వాళ్ళు మీకు గుర్తుకురారు. అలానే ఆ బాధ ని కూడా మీరు మర్చిపోతారు.
సోషల్ మీడియాలో బ్లాక్ చేయండి:
బ్రేకప్ అయిన తర్వాత పదేపదే సోషల్ మీడియా ద్వారా వాళ్లు మీకు కనబడుతూ ఉంటారు దీని వలన బాధ పెరిగిపోతూ ఉంటుంది తప్ప తరగదు. కాబట్టి వాళ్ళని బ్లాక్ చేయడం అన్ ఫ్రెండ్ చేయడం వంటివి చేయండి.
ట్రావెల్ చేయండి:
దూర ప్రయాణాలు చేయడం వలన కూడా మీరు వాళ్ళని మర్చిపోగలుగుతారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి:
మీరు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపితే కూడా వాళ్ళని మర్చిపోవడానికి అవుతుంది. అలానే ఓపికగా ఉండండి ఆ వ్యక్తి గురించి ఆలోచనలు మానుకొని హాయిగా ఉండండి.