భారత్ తో సంబంధాలు కొనసాగిస్తామని తాలిబన్ల అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ ప్రకటించారు. భారత్ తో సాంస్కృతిక, వాణిజ్య, రాజకీయ, వ్యాపార సంబంధాలు కొనసాగిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా భారత్ ఆఫ్గనిస్తాన్ కు ముఖ్యమైన దేశమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అబ్బాస్ సోషల్ మీడియా ద్వారా అధికారిక వీడియోను విడుదల చేశారు. ఆఫ్గనిస్తాన్ లో చాంబహార్ ప్రాంతాన్ని భారత్ అభివృద్ధి చేసిందని అబ్బాస్ పేర్కొన్నారు.
అంతే కాకుండా పలు సంస్థలు..గ్రూపులతో చర్చలు జరిపిన తరవాత ఆఫ్గనిస్తాన్ ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అబ్బాస్ వెల్లడించారు. తమ ప్రభుత్వంలో విభిన్న వర్గాల ప్రజల ప్రాతినిధ్యం ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ మాత్రమే కాకుండా చైనా,రష్యా, పాకిస్థాన్ దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని అబ్బాస్ వెల్లడించారు.