మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని : కిషన్‌ రెడ్డి

-

మరోసారి మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని ఆరోపించారు. కోవిడ్ సమయంలో తాను చేసిన సేవా కార్యక్రమాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు కిషన్ రెడ్డి. అనాధ పిల్లలకు కుర్ కురే ప్యాకెట్లు పంచిపెడితే తప్పుబట్టడం ఎంత వరకు కరెక్ట్ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కంటే కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీలో కష్టపడి సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు. తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లాగా మంత్రిని కాలేదని విమర్శించారు. కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను ఎన్నిసార్లు పరామర్శించానో ప్రజలకు తెలుసు అన్నారు కిషన్ రెడ్డి.

వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే కార్యక్రమానికి రైల్వేమంత్రి ఆశ్వనీ వైష్ణవ్ పాల్గొంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం పంపిందని…ఆయన హాజరవ్వటమనేది ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ నిర్మూలక కోసం కేంద్రం రూ. 800 కోట్లు నిధులిచ్చిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు త్వరలో పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మోదీ ప్రభుత్వం భర్తీ చేయబోతోందని తెలిపారు. ప్రతి నెలా 70 వేల నుంచి లక్ష ఉద్యోగాల భర్తీ చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version