శబరిమలలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి

-

శబరిమలలో మకరజ్యోతి దర్శమిచ్చింది. భక్తజనం పులకించిన పొన్నాంబలమేడు కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. మకరజ్యోతి దర్శనం కోసం శబరిగిరులకు భక్తులు పోటెత్తారు. మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

అయ్యప్పస్వామి భక్తులకు నేడు పరమపవిత్ర మకరజ్యోతి (మకర విళక్కు) దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించి తరించిపోయారు. ఇక్కడి పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే స్వామి శరణం… అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగిపోయింది. ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి మూడు సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పొన్నంబలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకరవిళక్కును దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version