మందుబాబులకు అమెజాన్ అండ..! బంపర్ ఆఫర్..!

-

ఇకపై మందుబాబులకు పండగే పండగ..! దర్జాగా ఇంట్లో కూర్చొని ఫోన్ లో ఆర్డర్ పెడితే చాలు నిమిషాల్లో మద్యం ఇంటికే వచ్చేస్తుంది. ఇప్పటికే జనాలు స్విగ్గీ జొమాటో లకు తెగ అలవాటు పడ్డారు ఇక అదే తరహాలో ఇక పై మందును కూడా ఆన్లైన్ ద్వారా డెలివరీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న అమెజాన్ భారత్ లో ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే ఇక ఇప్పటినుండి మద్యాన్ని కూడా ఇదే తరహాలో డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

అంతేకాకుండా ఈ విశయం పై ప్రభుత్వాలతో చర్చలు కూడా మొదలు పెట్టేసింది. అమెజాన్ తో పాటు, బిగ్ బాస్కెట్, సెన్రిసా టెక్నాలజీస్‌, గోల్డెన్‌ గొయెంకా కామర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇలా మరెన్నో సంస్థలు ముందుకొచ్చాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చించగా వారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని పశ్చిమ బెంగాల్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో అమలులోకి వచ్చిందంటే మరిన్ని రాష్ట్రాలకు చేరడం అంత అతిశెయోక్తి ఏమి కాదు. బెంగాల్ లో ఇప్పటికే జొమాటో, స్విగ్గీతోపాటు స్పెన్సర్స్‌, హిప్‌బార్‌ లాంటి సంస్థలు మద్యం డెలివరీ ప్రారంభించేశాయి ఇక అమెజాన్ అడుగు పెట్టడంతో మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బిజినెస్ త్వరలో ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version