దుర్గమ్మ దర్శనానికి రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్
దసర శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తజనంతో నిండిపోయింది. అర్థరాత్రి 1 గంట నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తుల రావడంతో రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.