రేపు నగరానికి రాష్ట్రపతి..

-

భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం శుక్రవారం హైదరాబాద్ పర్యటనకురానున్నారు. దీంతో డిసెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఈ మేరకుఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లుచేశారు. రాష్ట్రపతి శీతాకాల విడిది బొల్లారంను కేంద్ర భద్రతా సిబ్బంది తమఆధీనంలోకి తీసుకున్నారు.  రాష్ట్రపతి విడిది నేపథ్యంలో తెలంగాణ సీఎస్ ఎస్‌కేజోషి మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలనిసూచించారు. ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి కోవింద్చేరుకుంటారని తెలిపారు.  రాష్ట్రపతి పర్యటన సంర్భంగా బొల్లారం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

రాష్ట్రపతిపర్యటన షెడ్యూల్.. 
డిసెంబర్ 21వ తేదీన సాయంత్రం 5గంటలకు హకీంపేటవిమానాశ్రయానికి రాష్ట్రపతి కోవింద్ చేరుకోనున్నారు.

డిసెంబర్ 22న కరీంనగర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.

డిసెంబర్ 23న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు కోవింద్.

డిసెంబర్ 24న తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version