వివరాల్లోకి వెళితే… పాద్రా నగరంలో ఏప్రిల్ 26న అర్థరాత్రి రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిపై పాద్రా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భవేశ్ పటేల్ తన యూవీ స్పోర్ట్స్ వెహికల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో 18 కేసులున్నట్లు గుర్తించారు. ఇక కేసు విచారణను ముమ్మరం చేశారు. బలమైన ఆధారాలు సేకరించేందుకు వేట మొదలుపెట్టారు.
అసలు స్పోర్స్ వెహికల్ ముందు సీటులో అత్యారానికి పాల్పడే అవకాశం ఉంటుందా?.. సీటును వెనక్కి నెట్టడం ద్వారా లభించే స్థలం ఎంత ఉంటుంది…?. వెహికల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌కు సంబంధించి సాంకేతిక వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు స్థానిక ఆర్డీవో అధికారులకు సమచారం అందించారు. దీంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థన ఇదే తొలిసారి అంటున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగిన వివరాలను అందజేస్తామని తెలిపారు. అయితే నేరం జరిగిందనేని మాత్రం పోలీసులు నిర్ధారించాలని చెబుతున్నారు.