చేతుల శుభ్రత గురించి ఇప్పుడు మాట్లాడుకున్నంతగా ఇంకెప్పుడూ మాట్లాడుకోలేదు. శుభ్రత గురించి రోజుకో కొత్త పద్దతులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి దూరం పెట్టడానికి చేతులు శుభ్రపర్చుకోవడం సరైన మార్గం కాబట్టి, దానిపట్ల ఆ మాత్రం శ్రద్ధ వహించాల్సిందే. ఐతే అందరూ ఆలోచిస్తున్నట్టుగా సూక్ష్మక్రిములను చంపడం వరకే మీరూ ఆలోచిస్తున్నారా? కొంచెం ముందుకు వెళ్ళండి. పదే పదే చేతులు శుభ్రపర్చుకోవడం వల్ల దురద, అరచేతుల్లో చిరాకు వంటివి వస్తున్నాయి.
అంతేకాదు చేతులు పొడిగా మారడానికి కూడా కారణం అవుతుంది. అలా కాకుండా చేతుల తేమని దూరం చేయకుండా, సూక్ష్మక్రిములని దూరం చేసే హ్యాండ్ వాష్ లని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీ హ్యాండ్ వాష్ సూక్ష్మక్రిములని, బాక్టీరియాని, వైరస్, చెత్త ని దూరం చేస్తుందో లేదో తెలుసుకోండి. ఈ లక్షణాలు హ్యాండ్ వాష్ మీరు వాడుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. సువాసన వచ్చే హ్యాండ్ వాష్ మంచిదని అనుకోవద్దు. హ్యాండ్ వాష్ తో కడుక్కున్న తర్వాత మీ చేతులు సువాసన వస్తుంటే అది మంచిదని అనుకోవద్దు.
చర్మాన్ని తేమగా ఉంచుతుందా?
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉన్న హ్యాండ్ వాష్.. షియా బట్టర్ మూలక పదార్థంగా గలది.
. చర్మాన్ని తేమగా ఉంచే షియా బట్టర్ కలిగిన హ్యాండ్ వాష్ వాడడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.
ఎప్పుడు హ్యాండ్ వాష్ తీసుకున్నా ఆర్గానిక్, నేచురల్ ది మాత్రమే ఎంచుకోండి. వేప, తులసి, టీ ట్రీ, నిమ్మ మొదలగు పదార్థాలు ఉన్న హ్యాండ్ వాష్ లు మంచి రక్షణని ఇస్తాయి. దానిలో ఉండే యాంటీబాక్టీరియా ధర్మాలు చర్మాన్ని తేమగా ఉంచుతూనే పరిశుభ్రంగా, క్రిములు లేకుండా ఉంచుతాయి.
పీహెచ్ వాల్యూ సరిగ్గా ఉన్నదే ఎంచుకోండి. అలాగే ఎక్కువ పదర్థాలు అంటే అతిగా ఉన్న పదార్థాలు ఉన్న వాటిని వాడవద్దు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది గుర్తుంచుకోండి.