ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీసుకొచ్చాక మహిళల ప్రవర్తన మీద అనేక ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సీట్ల కోసం కొట్టుకుంటుంటే మరికొందరు ఏకంగా డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన లగేజీ బ్యాగును బస్సులో అడ్డంగా ఉంచడంతో పాటు తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.
ఇదే విషయంపై కండక్టర్ ఆ మహిళా ప్యాసింజర్‌ను ప్రశ్నించగా.. ‘నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా..కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో’ అంటూ ఆ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. నిర్మల్ డిపో (టీఎస్ 18 టీ 8485)కు చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుంచి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది. కండక్టర్ డీఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం
నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది. అయితే బైంసా మండలం దేగామ్… pic.twitter.com/2JaoBXa6Gt
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2025