లక్ష్మీనారాయణ కమ్మింగ్ సూన్….

-

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి లక్ష్మానారాయణ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆయన పర్యటించిన అనంతరం క్షేత్ర స్థాయిలో గమనించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు… అన్నం పెడుతున్న రైతు…తనకే తిండి లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు.  స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయమని రైతులు వేడుకుంటున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరుతున్నారు.

రైతులు తమ రుణాలను మాఫీ చేయండని కంటే. గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నారు. పురాతన గ్రామీణ కళలు పతనమవుతున్నాయి. గ్రామాలన్ని కళాకాంతీ లేకుండా ఉన్నాయి.. స్మార్ట్‌ నగరాల కంటే.. స్మార్ట్‌ గ్రామాలే ముఖ్యం. యువతను వ్యవసాయం వైపు నడిపించేలా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ను మొదలుపెట్టబోతున్నాం.  గ్రామీణ ప్రాంతాల్లో నా పరిశీలనలు, అక్కడి సమస్యలు, పరిష్కారాలు, రైతుల అవసరాలపై ఒక గ్రామీణ నివేదికను ముఖ్యమంత్రికి త్వరలోనే సమర్పిస్తాను. క్షేత్రస్థాయిలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది. దీనిపై అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమం తీసుకొస్తాను. రాష్ట్రంలో మార్పు రావాలి… అధికార ప్రతిపక్షాలు విమర్శ ప్రతివిమర్శలతోనే ప్రజా ధనాన్ని విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version