హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల్లో 1663 ఓట్లతో ఆర్తి నాగ్‌పాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్ఐ అభ్యర్థి ఎర్రం నవీన్‌పై 334 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 6 స్థానాలకుగాను ఆరింటిలో ఏబీవీపీ జయకేతనం ఎగరవేసింది. తెలంగాణ ఎన్నికల ముందు బీజేపీకి శుభవార్త అందించింది. వైస్ ప్రెసిడెంట్గా అమిత్ కుమార్ కుమార్ (1505 ఓట్లు) ఎన్నియ్యారు, అభిషేక్ కుమార్ (1446) పై విజయం సాధించిన ధీరజ్ (1573) జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ప్రవీణ్ కుమార్ (1417).. అనుపమ కృష్ణన్ (1378)పై విజయం సాధించారు. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విజయంపై ఏబీవీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.