గత కొద్దిరోజులుగా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గ్రూపుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మొన్న వెంకట్రావు పుట్టిన రోజు వేడుకల్ని ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటుందని ఆయన మీడియాకి ఎక్కి మరీ విమర్శలు వచ్చాయి. అంటే కాదు వంశీతో కలిసి పనిచేసేది లేదని ఈ విషయాన్ని జగన్‌కే చెప్పానని అన్నారు. అయితే ఈ క్రమంలో వంశీ రాజకీయాల నుండి తప్పుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఈ ఉదయం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకట్రావుల చేతుల్ని తీసుకుని తన చేతిలో వేసి కలిపారు. ఈ ఉదయం జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్ వంశీ, వెంకట్రావు ఇద్దరి చేతుల్ని కలిపారు. అంటే కాదు కలిసి పనిచేసుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో వంశీ యార్లగడ్డ వైపు చూసి నవ్వారు. కానీ ఆయన మాత్రం ఏమీ అనకుండా అలాగే నిలబడి పోయారు. అయితే వెంకట్రావు ఏదో చెప్పబోదమనుకునే లోపే జగన్ ముందుకు వెళ్ళిపోయరు. ఈ సమయంలో కొడాలి నాని కూడా అక్కడే ఉన్నారు.